గరిమెళ్ళ పాడు సాక్షిగా పూరించిన ఎన్నికల శంఖారావం
ఆజాద్ అధికార సేన రాష్ట్ర అధ్యక్షులు కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్
ఉదయం జిల్లా ప్రతినిధి అక్టోబర్ 18.. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.. మారుమూల గిరిజన గ్రామానికి తాను అండగా నిలిచి.. విద్య వైద్యం ఉపాధి మౌలిక సదుపాయాలు కల్పించి ఆ గిరిజనుల కళ్ళలో కొత్త కాంతిరేఖలను నింపిన ఆజాద్ అధికార సేన రాష్ట్ర అధ్యక్షులు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్ బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రశాంతినగర్ పంచాయతీలోని గరిమెళ్ళ పాడు గి గిరిజన గ్రామాల సాక్షిగా తన ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆయనకు గిరిజనులు సాంప్రదాయ పద్ధతిలో ఘనస్వాగతాన్ని పలికారు. గడపగడపకు ప్రచారాన్ని ముమ్మరంగా చేపట్టారు తొలిసారిగా ఎన్నికల బరిలో దిగుతున్న ఉదయ్ అన్నకు మనసు నిండుగా నీరాజనాలు పలికారు. దుష్టశక్తులు కుట్రలు పన్నినా.. తన రాజకీయంతో ఓటుకు నోటు వల విసిరిన మేము దేనికి వెనకాడ బోమని మీ క్షేమాన్ని మరిచి మా కోసం మా క్షేమం కోసం అను నిత్యం కష్టపడిన ఓ మహోన్నత వ్యక్తి నీ త్యాగం వృధా కానివ్వం కడదాకా మీతోటే సాగిపోతాం అంటు మెండుగా ఆశీర్వదించారు . కొత్తగూడెం నివాసి ఆర్టీసీ ముద్దుబిడ్డ స్థానికుడు.. సంస్కారం ఉన్నోడు ఎదుటి మనిషి బాధలు తెలిసినోడు.. ఆ బాధలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చిన వాడు ఇమంది ఉదయ్ కుమార్ ఆజాద్ అధికార సేన పార్టీ తరఫున కొత్తగూడెం నియోజకవర్గం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో మేమున్నామంటూ గిరిజనలందరూ ఒక్కటే జై ఉదయన్న జై జై ఉదయన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టి సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో స్వార్థపూరిత రాజకీయాలకు చెక్ పెట్టి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తూ ఏదో సాధించాలనే సంకల్పంతో ఈ సమర శంఖారావాన్ని పూరించానని ప్రతి ఒక్కరు తనను ఆశీర్వదించి ఎన్నికల బరిలోకి దించితే గెలుపే దిక్సూచిగా ప్రతి ఒక్కరు సైనికుల పనిచేసే నమ్ముకం నాకు ఉందని మీ మనోదైర్యమే తనకు కొండంత అండ అంటూ ఆకాంక్షించారు. ఏ సమస్యల్ని సంఘటితంగా పోరాడి సాధించుకున్నామో అదే పట్టుదలతో తనకోసం ప్రతి ఒక్కరు స్వార్థం వీడి పని చేయాలని పిలుపునిచ్చారు. ఓటు కోసం నక్క వినయాలు ప్రదర్శిస్తూ లేనిపోని ఆశలు కల్పిస్తూ అక్కరకు రాని చుట్టంగా అనేకమంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారని వారి మాటలను నమ్మవద్దని పిలుపునిచ్చారు. మీలో ఒకటిగా మీ ముందుకు వచ్చానని మనస్ఫూర్తిగా తనను ఆచరించి మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని కోరారు. ఆయన వెంట ఇమంది కృష్ణవేణి, సమ్మక్క సీమకుర్తి రామకృష్ణ దశరథ్ రజువా గరిమెళ్ళ పాడు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.



