U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణరాజకీయం

ప్రజాక్షేత్రంలోకి “నేనొస్తున్న”

ప్రజాక్షేత్రంలోకి “నేనొస్తున్న”
ప్రచార రథాన్ని ప్రారంభించిన కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్
ఆశీర్వదించండి కొత్తగూడెం అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా

స్వార్థపూరిత రాజకీయాలకు చెక్ పెట్టేందుకు ప్రజలకు నేనున్నానంటూ నిస్వార్థమైన సేవలు అందించేందుకు ఇక నేను వస్తున్నానంటూ ఆజాద్ అధికార సేన రాష్ట్ర అధ్యక్షులు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మంగళవారం పాల్వంచ మండలం జగన్నాధపురం లోని పెద్దమ్మ తల్లి ఆలయంలో తన ఎన్నికల ప్రచార రథాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్యం సిద్ధించాలంటే దేవుని అనుగ్రహం కావాలని అందుకే తొలిసారిగా తన ప్రచార రథాన్ని స్థానిక పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ప్రారంభించి ప్రజాక్షేత్రంలోకి ప్రచారానికి పంపుతున్నారని ప్రజలు తనపై నమ్మకం ఉంచి తన ప్రచార రథానికి అడుగడుగునా నీరాజనాలు పలకాలని ఆకాంక్షించారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా హామీలను పక్కనపెట్టిన స్వార్థపూరిత నేతలను మనం చూసే ఉంటామని తాను స్థానికుడిని సామాన్య కుటుంబంలో పుట్టి ప్రజాసేవకే తొలిసారిగా కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని మీ అమూల్యమైన ఓటు వేసి తనను గెలిపిస్తే కొత్తగూడాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి చూపెడతానని స్పష్టం చేశారు. కార్య సాధన దిశలో కష్టాలు నష్టాలు ఎదురైనప్పటికీ తన ముందున్న లక్ష్యాన్ని సాధించేందుకు వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. యువతకు ప్రధానంగా ప్రాధాన్యత కల్పించే గేయంగా నేను అడుగు ముందుకు వేస్తున్నానని తనతో పాటు నడిచే యువతకు స్వాగతిస్తున్నానని అన్నారు. బ్రష్టు పట్టిన రాజకీయాల్లో సరికొత్త మార్పులు తెచ్చుకుని తనకు సంపూర్ణంగా మద్దతు తెలిపి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు కృష్ణవేణి, గణేష్, వసుధ, వేణుగోపాల్, కమల్ జ్యోతి సీమకుర్తి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రపంచ కప్ ను సాధించిన అండర్ 19 మహిళా జట్టుకు, అద్భుత ప్రతిభ కనబరిచిన భద్రాచలం ముద్దుబిడ్డ

సీఎం రేవంత్ ను కలిసిన జర్నలిస్టు సంఘం నేతలు.

కిన్నెరసాని నీటి పథకం.. లీకేజీలే అధికం..

Leave a Comment