ఒక్క రూపాయి ఇచ్చి.. మీ మద్దతు తెలపండి
ఐదేళ్లపాటు ఒక్క రూపాయి తీసుకోకుండా సేవకుడిగా పని చేస్తా..
నినాదానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఓటర్లు
వినూత్న రీతిలో ఓటు అభ్యర్థించిన కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్
ఉదయం జిల్లా ప్రతినిధి నవంబర్ 6.. ఓటరు దేవుళ్ళారా.. మీ మనిషిగా మీ ముందుకు వస్తున్న కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో కొత్త మార్పు తెచ్చేందుకు చేస్తున్న ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ ఒక రూపాయి ఇచ్చి మీ ఓటు మద్దతు తెలపండి. ఐదేళ్లపాటు ఒక్క రూపాయి తీసుకోకుండా సేవకుడిగా పని చేస్తా అంటూ ఆజాద్ అధికార సేన పార్టీ బలపరుస్తున్న కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్ జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలోని చిన్న బజార్ పెద్ద బజారులలో సోమవారం వినూత్న రీతిలో తన ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఇచ్చిన హామీలను పక్కనపెట్టి ఓటర్లను ప్రజలను అనేక ప్రలోభాలకు గురిచేసి ఓటు పొందిన పెద్దలు కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో ముఖం చాటేసారని స్వార్థపూరిత రాజకీయాలకు స్వస్తి పలికి నిస్వార్ధంగా సేవ చేసే సేవకుడిగా చేతులు జోడించి అభ్యర్థిస్తున్నాను మీ అమూల్యమైన ఓటు ఒక్క రూపాయి ఇచ్చి మద్దతు తెలిపి తనను గెలిపించాలని కోరారు. మీరు ఇచ్చే ప్రతి రూపాయికి జవాబుదారీగా ఉంటానని స్వతంత్ర అభ్యర్థిగా అధిక మెజార్టీతో గెలిపించి తనను అసెంబ్లీ మెట్లు ఎక్కించాలని అభ్యర్థించారు. కొత్తగూడెం నియోజక వర్గాన్ని ఎంతోమంది నేతలు పాలించడం మనం చూశాం అభివృద్ధిలో అనేక ప్రాంతాలు ఆమడ దూరంలో ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగా అనేక సమస్యలు నేటికీ వెక్కిరిస్తున్నాయి. ఈ దుస్థితి నుంచి ప్రజలను కాపాడాలంటే సరికొత్త మార్పు తేవాలంటే ఓటర్ దేవుడు ఇచ్చే ఓటు తీర్పుతో మన భవిష్యత్తును మార్చుకుందాం సరికొత్త మార్పును తెచ్చుకుందాం అంటూ ఇమంది ఉదయ్ కుమార్ అన్ని వర్గాల ప్రజలను ఓటు అభ్యర్థించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో కొత్తవారికి అవకాశం కల్పించాలని ప్రజల ఆలోచిస్తున్నారని ఉదయన్నకే మా సంపూర్ణ మద్దతుతెలుపుతూ ఓటర్ దేవుళ్ళు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రచారంలో ఉదయ్ కుమార్ వెంట ఆయన సతీమణి కృష్ణవేణి, ఇమంది గణేష్, సీనియర్ పాత్రికేయులు సీమకుర్తి రామకృష్ణ, చెంగపొంగు సైదులు, దశరధ్ రజువ, కమల్ ,రాకేష్ బిర్రు నరసింహారావు, ఆజాద్ అధికార సేన జిల్లా మహిళా అధ్యక్షురాలు మల్లూరి అనూష గరిమెళ్ళ పాడు గిరిజనం తదితరులు పాల్గొన్నారు

