పెనుబల్లి వంతెనపై భారీ గొయ్యి…
భారీ వాహనాలకు నో ఎంట్రీ…
ఉదయం, కొత్తగూడెం డిసెంబర్ 07
గత రెండు రోజులుగా మిచౌంగ్ తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.. నిన్న బుధవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చుంచుపల్లి మండలం పాత కొత్తగూడెం – పెనుబల్లి మార్గ మధ్యలో ఉన్న గోధుమ వాగు వంతెన పై నుంచి వరద నీరు ప్రవహించడంతో అధికారులు ఆ గ్రామానికి రాకపోకలు నిలిపివేశారు. బుధవారం అర్ధరాత్రి ఆ వంతెన పై
భారీ గొయ్యి పడినట్లుగా గ్రామస్తులు గుర్తించడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఆ గొయ్యిని పూడిచే పనిలో పడ్డారు.. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆ వంతెనపై రాకపోకలు నిలిచిపోయాయి..
గత ప్రభుత్వంలో అప్పటి ఎమ్మెల్యే వనమా చేతుల మీదుగా పెనుబల్లిలోని గోధుమ వాగు వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసింది.ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో గోధుమ వాగు వంతెన నిర్మాణానికి మోక్ష కలుగుతుందో లేదో వేచి చూడాల్సిందే..

