ప్రెస్/ మీడియా వారికి సమాచారం కొరకు..
నమస్కారం..
పద్మశాలి సభ్యత్వం చివరి సభ్యుడి వరకు చేరాలి ..
పుట్టా శంకరయ్య . సంఘం ఎన్నికల కన్వీనర్.
భద్రాద్రి కొత్తగూడెం.
పద్మశాలి కుల బాంధవుల సభ్యత్వం చివరి సభ్యుడు వరకు చేర్పించాలని ఆకాంక్షించారు కొత్తగూడెం పద్మశాలి సంఘమునకు సంబంధించిన ఎన్నికల కన్వీనర్ పుట్టా శంకరయ్య. కొత్తగూడెం భజన మందిర్ వద్ద గల పద్మశాలి కళ్యాణ మండపంలో బుధవారం సమావేశం నిర్వహించారు. పద్మశాలి కుల బాంధవులందరూ తప్పనిసరిగా సభ్యత్వం స్వీకరించి ఎన్నికలలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ మరియు మండలాలలోని అన్ని వార్డులలో ఉండే పద్మశాలి కుటుంబ సభ్యులందరికి సభ్యత్వాలు అందే విధంగా చూడాలని అన్నారు . కమిటీ సభ్యులకు సభ్యత్వ నమోదు పుస్తకాలను అందజేశారు. పద్మశాలి కుల బాంధవులు తప్పనిసరిగా సభ్యత్వ నమోదు తో పాటు పూర్తి వివరాలను సంఘ సభ్యులకు అందజేయాలని కన్వీనర్ పుట్టా శంకరయ్య అన్నారు. సభ్యత్వం కావాల్సిన వారు వార్డులు మరియు ఆయా ప్రాంతాలకు వచ్చే పద్మశాలి ఎన్నికల కమిటీ ప్రతినిధులకు వివరాలను అందజేయాలన్నారు. సభ్యత్వం ఉన్నవారు మాత్రమే ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులుగా పరిగణింపబడతారని పద్మశాలి కుల బాంధవులు అందరూ గమనించాలని తెలిపారు. మిస్ అయినవారు పద్మశాలి కళ్యాణ మండపంలో ఉన్న పద్మశాలి కార్యాలయంలో సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవచ్చునని అన్నారు ఈ కార్యక్రమంలో అడహాక్ కమిటీ సభ్యులందరూ పాల్గొన్నారు.

