- భూక్యా రమేష్
సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు
పట్టాల తో సంబంధం లేకుండా ఇందిరమ్మ ఇండ్లకు అర్హతున్న వారందరికీ ఐదు లక్షలు ఇవ్వాలి.
25,26 వార్డులో అధికారులను నిలదీసిన సీపీఎం నేతలు.
స్థానిక 25,26 వ వార్డులో ప్రారంభమైన ఇందిరమ్మ ఇల్లు ప్రజలకు కేటాయింపుల అవకతవకలు జరిగాయని ఉన్నవారికి ఇల్లు వచ్చాయని లేనివారికి అర్హత ఉన్నవారికి ఇందిరమ్మ ఇండ్ల విషయంలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వెంటనే విచారణ జరిపి అర్హులైన వారికి కేటాయించాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్ అధికారులను డిమాండ్ చేశారు. కొత్తగూడెం పట్టణంలో 25,26 వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు తదితర సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని దరఖాస్తుదారులకు జాబుతారీతనంగా రసీదులు ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్ డిమాండ్ చేశారు. పేద ప్రజలు అర్హులైన ప్రజలు దరఖాస్తు చేసుకున్న సంక్షేమ పథకాలు వారికి దక్కుతాయన్న ఆశతో వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఇందిరమ్మ సభలో అర్హులైన పేదలకు నిరాశ మిగిలిందని అక్రమాలు చోటు చేసుకున్న నేపథ్యంలో విచారణ చేపట్టాలని భూక్యా రమేష్ ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులో పారదర్శకత లోపించిందని ,అర్హులైన వారికి కాకుండా అనర్హులకు కూడా ఇందిరమ ఇండ్లు మంజూరు అయ్యాయని ,అర్హత కలిగిన వారికి రేషన్ కార్డులు రాలేదని, రేషన్ కార్డులలో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు కాలేదని, ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ పట్టా ఉండాలని, పట్టా లేకుంటే ఇందిరమ్మ ఇండ్లు రాదని, అనేక సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారని వాటికి సరైన సమాధానం ఇవ్వలేక అధికారుల వద్ద స్పష్టత లేకపోవడం వల్ల ఇందిరమ్మ సభ అంతా గందరగోళంగా మారి స్పష్టత లోపించిందని భూక్య రమేష్ విమర్శించారు.
స్పెషల్ ఆఫీసర్ అలీం వివరణ
నిజమైన లబ్ధిదారుల పట్ల ఇందిరా మా ఇల్లు రాకపోతే వెంటనే విచారణ చేపడతామని రాణి వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని, పట్టా లేకున్నా కూడా ప్రజలు దరఖాస్తు చేసుకోవాలని ప్రజలు చెప్పి, సిపిఎం నేతలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఎం నాయకులు ఎన్ ఎస్ రాజు , గూగుల్ చక్రం, విజయ్ మోహన్, హరి, గిరి ప్రసాద్, బన్సీలాల్, సునీల్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు

