U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

కిన్నెరసాని పథకం కార్మికులకు అండగా ఉంటాంసిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

కిన్నెరసాని పథకం కార్మికులకు అండగా ఉంటాం
సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా

ఉదయం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 15

కొత్తగూడెం పట్టణానికి త్రాగునీరందిస్తున్న కిన్నెరసాని నీటి ప్రాజెక్టులో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యల పరిస్కారానికి కృషి చేస్తామని, కార్మికులకు కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందని సిపిఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా స్పష్టం చేశారు. శుక్రవారం కిన్నెరసాని నీటి సరఫరా పథకాలను పరిశీలించి అనంతరం ఆయన మాట్లాడారు సుదీర్ఘకాలంగా ఈ ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు శ్రమిస్తున్నారని, వీరికి అధికారులు శ్రమకుతగిన వేతనం సకాలంలో అందించాల్సిన అవసరం ఉందన్నారు. కనీస వేతనాలు, చట్టపరమైన హక్కులు అమలయ్యేవిదంగా అధికారులపై వత్తిడి తెస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి గెడ్డాడు నగేష్, కార్మికులు పాల్గొన్నారు.

Related posts

తాత్కాలికమేనా..? కెసిఆర్ సార్.. చూడండి అధికారుల తీరు

గౌతంపూర్ గ్రామ సభలో అధికారులను నిలదీసిన బీజేపి నేతలు..

ప్రభుత్వ ఆసుపత్రిలో 90 ఏళ్ల వృద్ధురాలికి అరుదైన ఆపరేషన్

Leave a Comment