. చీకటి కార్తిక్ మాదిగ సామాజిక వర్గం అని,జీర్ణించు కోలేని కొందరు వెనుక నుంచి చేస్తున్న కుట్ర
. 16 వేల మెజార్టీతో గెలిచిన చీకటి కార్తిక్ ఎదుగుదలను, ఓర్వలేని, పక్కనే ఉన్న ఓ దళిత సామాజిక వర్గం చేస్తున్న నీచ రాజకీయం
. చీకటి కార్తిక్ కు మాదిగ జే.ఏ.సి.అండగా ఉంటదని తెలియజేస్తున్నాము
మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర జనరల్ సెక్రటరీ:- మోదుగు జోగారావు
కొత్తగూడెం::కూలిలైన్():- ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కూలి లైన్ లో మాదిగ జే.ఏ.సి.ముఖ్యనాయకుల అత్యవసర సమావేశంలో మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర జనరల్ సెక్రటరీ మోదుగు జోగారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ,గృహనిర్మాణ శాఖ మంత్రి వర్యులు శ్రీ గౌ పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారి ప్రధాన అనుచరుడు చీకటి కార్తిక్ జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసి,16 వేల మెజార్టితో గెలిచిన విషయం తెలిసిందే.బి.ఆర్.యస్. పార్టీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని ఒక్క చీకటి కార్తిక్ ను అనటం అర్ధరహితం అని అన్నారు.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ లో ఉన్న మంత్రులు శ్రీ గౌ తుమ్మల నాగేశ్వరావు గారు,శ్రీ గౌ సీతక్క గారు,మన డైనమిక్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌ రేవంత్ రెడ్డి గారు వీరందరిని కూడా మీరు ఈ విధంగా విమర్శిస్తున్నారా,ఇది అంతా చూస్తుంటే మీతో ఎవ్వరో చేపిస్తున్నారని మాకు అనుమానం వస్తుంది.ఎంతో కష్ట పడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తే,మీ పిల్ల చేష్టలు వలన కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగే ప్రమాదం ఉన్నది.గాంధీభవన్ లో చీకటి కార్తిక్ విషయంలో గొడవ చేసిన వారి పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీని కొరతవున్నాము.చీకటి కార్తిక్ ఒక మాదిగ సామాజిక వర్గం అనే,అతని ఎదుగుదలను ఓర్వ లేని,నిత్యం పక్కనే ఉండే దళిత సామాజిక వర్గంలోని కొందరు ఈ విధమైన చిల్లర రాజకీయాలు చేసి,కాంగ్రెస్ పార్టీకి నష్టం చేయవద్దు అని,వారు కూడా సమాజంలో అబాసూ పాలు కావద్దు అని తెలియజేస్తున్నాం.చీకటి కార్తిక్ కు మాదిగ జే.ఏ.సి.నిత్యం అండగా ఉంటదిని తెలియజేసినారు.ఈ సమావేశంలో మాదిగ జే.ఏ.సి.నాయకులు జే.రాజేష్,పి.కుమార్,యన్.సత్యనారాయణ తదితరులు పాలుగోన్నారు.

