U9udayam.com | Telugu Local News App Latest News
ఆంధ్రప్రదేశ్

ఎస్.ఆర్ డి.జి స్కూల్ విద్యార్థి క్షేమంగా ఉన్నాడు

తల్లిదండ్రుల కోరిక మేరకు మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ తరలింపు

కొత్తగూడెం , జూన్ 25 ( ఉదయం న్యూస్ )

చుంచుపల్లి మండలం లో గల ఎస్.ఆర్ డి.జె స్కూల్ నందు చదువుతున్న విద్యార్థి ని పాఠశాల ఉపాధ్యాయులు హోం వర్క్ చేయలేదని మందలించడం తో విద్యార్థి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడటంతో కొత్తగూడెం లో చర్చనీయాంశంగా మారింది. స్కూల్ యాజమాన్యం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చుంచుపల్లి మండలంలో ఎస్.ఆర్ డి.జె పాఠశాల లో చదువుతున్న 10 వ తరగతి విద్యార్థి హోం వర్క్ చేయలేదని మంగళవారం ఉపాధ్యాయులు మందలించడం జరిగిందని తెలిపారు. మనస్తాపానికి గురైన విద్యార్థి ఇంటి వద్దనే ఎలుకలు వంటి కీటకాలు చంపే మందు ని తాగి బుధవారం స్కూల్ బస్సు ఎక్కడని బాధిత విద్యార్థి తెలిపాడని అన్నారు. బస్సు లో ఉన్నటువంటి తోటి విద్యార్థుల ద్వారా సమాచారం తెలిసిన వెంటనే విద్యార్థి తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించి తక్షణమే చుంచుపల్లి మండలం లో గల హాస్పిటల్ నందు వైద్యం అందించే ప్రయత్నం చేశామన్నారు. తల్లిదండ్రుల కొరినట్లుగానే కొత్తగూడెం లోని ప్రముఖ హాస్పటల్ కి తీసుకు వెళ్లినట్లుగా తెలిపారు. ప్రస్తుతానికి విద్యార్థి ఆరోగ్యం బాగానే ఉందని అన్నారు. మెరుగైన వైద్యం అందించాలని విద్యార్థి తల్లిదండ్రులు హైదరాబాద్ తీసుకు వెళ్తున్నట్లు సమాచారం ఉందన్నారు. బాగా చదివి విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉండాలనే ఆశించి బాగా చదవాలని చెప్పేందుకు మాత్రమే విద్యార్థులను మందలించడం జరుగుతుందని ఎస్.ఆర్ డి.జె స్కూల్ సిబ్బంది పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్ మెరుగు పడాలనే చూస్తామని ఏ యొక్క విద్యార్థిపై కక్షసాధింపు చర్యలు పాఠశాలలో ఉండవని ఎస్.ఆర్ డి.జె పాఠశాల జోనల్ ఇంచార్జ్ సతీష్ అన్నారు.

Related posts

ఎన్ హెచ్ ఆర్ సి భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులుగా మారెళ్ళ విజయకుమార్, ప్రధాన కార్యదర్శిగా చాప భానుప్రకాష్

చుంచుపల్లిలో హైడ్రాకు పని చెప్పాల్సిందే..!

తెప్పోత్సవం మరియు వైకుంఠ ద్వార దర్శన మహోత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు భాద్యతగా విధులు నిర్వర్తించాలి.

Leave a Comment