U9udayam.com | Telugu Local News App Latest News
క్రైమ్ వార్తలుతెలంగాణ

డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు: ట్రాఫిక్ ఎస్ఐ నరేష్

కొత్తగూడెం:  వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడిపితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ అన్నారు.
లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారితోపాటు వారి తల్లిదండ్రులు, సదరు వాహన యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. శనివారము ఓల్డ్ డిపో,RTC Bustand and Market area జాతీయ రహదారిపై  వాహనాల తనిఖీపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై నరేష్ మాట్లాడుతూ  జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, డిఎస్పి రెహమాన్ సూచనలతో ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనాలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి అన్నారు. ట్రాఫిక్ నిబంధనను పాటించాలని సూచించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రవర్తించాలని, మైనర్లు, డ్రైవింగ్ లైసెన్సు లేనివారికి వాహనాలు ఇవ్వరాదన్నారు.  డ్రైవింగ్ లైసెన్స్ కావలసిన వాళ్లు ట్రాఫిక్ సిబ్బందికి సంప్రదించాలని కోరారు.

Related posts

ఉత్తమ ఉద్యోగులకు ప్రశంసలు..

పాల్వంచ ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు..!

జర్నలిస్టుల సమస్యలపై సీఎం సభలో నిరసన.

Leave a Comment