U9udayam.com | Telugu Local News App Latest News
క్రైమ్ వార్తలుతెలంగాణ

రక్షించాల్సిన పోలీసులే శిక్షిస్తే ఎలా….


నా బిడ్డలపై అక్రమ కేసులు ఆపండి..
భూమి కోసం పోతే కేసులు పెడతారా..
మా భూమిలో అక్రమ నిర్మాణాలను ఆపండి..
లేదంటే మాకు చావే శరణ్యం అంటు…
గోడు వెళ్లబోసుకున్న బాధితులు..

ఉదయం/చుంచుపల్లి/ భద్రాద్రి కొత్తగూడెం.
అన్యాయం జరిగితే రక్షించాల్సిన పోలీసులే అక్రమంగా కేసులు పెడితే మేము ఎవరికి చెప్పుకోవాలి అంటూ బాధితులు బాబుక్యాంపు ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే చుంచుపల్లి కి చెందిన మద్దెల గోవర్ధన్ వారి తాతకు సంబంధించిన కొంత భాగం మాత్రమే అమ్మకం జరిగిందని కానీ తప్పుడు ఈ పత్రాలను సృష్టించి కొనుగోలు చేసినట్లుగా ఇద్దరి ముగ్గురు పేర్లను బదలాయించి మాకు మిగిలిన భూమిని కబ్జా చేసి పోలీసులతో బెదిరించి మాపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. 1964 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న మా తాత గారి భూమి మాకు వారసత్వంగా వచ్చిందని అప్పటినుంచి అట్టి భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగించామని తెలిపారు. కొత్తగూడెంలో రియల్ ఎస్టేట్ చేస్తున్న ఓ విద్యావేత్త 2018 కి ముందు బినామీ పేర్లతో మేము భూమిని అమ్మినట్లుగా దొంగ కాగితాలు సృష్టించి మమ్ములను భయబ్రాంతులకు గురి చేశారు. ఈనేపథ్యంలో మేము కోర్టులో కేసు వేసినాము. ఆ కేసు నడుస్తుండగానే మరలా ఈ మధ్యకాలంలో మరొక ఎస్టీ పేరుతోటి ఇద్దరి ముగ్గురు నకిలీ పత్రాలను సృష్టించి కోర్టులను పోలీసులను తప్పుదారి పట్టించి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకువచ్చినారు. ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకొని మమ్ములను ఆ స్థలంలోనికి రానీయకుండా పోలీసులను అడ్డుపెట్టుకొని మా పై దౌర్జన్యాలు చేసి మాపై కేసులు పెట్టి మరోసారి మాపై కేసులు బనాయించినారు. మేము పోలీసులను ఎదుర్కోలేక ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకురావాలన్న ఉద్దేశంతో మాకు న్యాయం చేయాలని వేడుకుంటున్నామన్నారు. పంచాయతీ అధికారులు రెవెన్యూ మరియు పోలీసులు అందరూ కలిసి కావాలని మాకు అన్యాయం చేస్తున్నట్లుగా అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మాకు న్యాయం చేస్తారని ఆశతో ఎదురుచూస్తున్నామని లేదంటే మాకు చావే శరణ్యమని వేడుకొన్నారు.

Related posts

భద్రాద్రి కి గర్వ కారణంకలెక్టర్ జితేష్ వి.పాటిల్.

ఉగ్రరూపంతో పొంగుపొర్లుతున్న మొర్రెడు వాగు

ఇసుక లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ ఢీకొని యువకుడి దుర్మరణంమరో వ్యక్తికి తీవ్ర గాయాలు

Leave a Comment