U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణరాజకీయం

జర్నలిస్టుల కోసం మంత్రిని కలిసిన ఇమంది ఉదయ్.


ఇందిరమ్మ ఇళ్ళు తెల్ల రేషన్ కార్డులు మంజూరుకై విజ్ఞప్తి.
హామీ ఇచ్చిన మంత్రి పొంగులేటి..

భద్రాద్రి కొత్తగూడెం.

భద్రాద్రి కొత్తగూడెం లోని జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మరియు తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయాలని టియూడబ్ల్యూజే ఐజేయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ అన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం క్లబ్ లో సోమవారం నాడు జరిగిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి త్వరలో ఇంటి స్థలాలు ఇందిరమ్మ ఇండ్లు మరియు తెల్ల రేషన్ కార్డులు మొదలైన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు గుణ సురేష్ ఈశ్వర్ నరసింహారావు శివ సుధాకర్ సైదులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రామ పంచాయతీలో తిష్ట వేసిన షాడో

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం..

జిల్లా కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ చీకటి కార్తిక్ పై ఆరోపణలు అర్ధరహితం

Leave a Comment