U9udayam.com | Telugu Local News App Latest News
క్రైమ్ వార్తలుతెలంగాణ

మర్డర్ మిస్టరీ ఛేదించిన పోలీసులు.

సీఐలను అభినందించిన డి.ఎస్.పి రెహమాన్.
వివరాలను వెల్లడించిన డి.ఎస్.పి.

ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో జరిగిన దారుణ హత్యకు సంబంధించి పోలీసులు చాకచక్యంగా అత్యంత వేగంగా చేదించారు. దానికి సంబంధించిన వివరాలను డీఎస్పీ బుధవారం సాయంత్రం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో వెల్లడించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ హత్యకు సంబంధించి అక్రమ సంబంధమే కారణమని తెలిపారు. వివరాల్లోకి వెళితే మృతుడు రామ్మోహన్రావుకు దాదాపు 15 ఏళ్లుగా రామవరానికి చెందిన వివాహిత మహిళతో అక్రమ సంబంధం ఉండేది. మహిళ భర్త రామ్మోహన్రావుకు స్నేహితుడు. హత్య చేసిన నిందితుడు సాహిర్ తో కూడా ఈ మధ్యకాలంలో సదరు మహిళ అక్రమ సంబంధాన్ని నడిపింది. రామ్మోహన్ రావు ను చంపిన సాహిర్ సైతం రామవరం ప్రాంతానికి చెందినవాడు ఇతనితో సైతం దాదాపు ఐదేళ్లుగా అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తుంది ఈ విషయం తెలిసిన రామ్మోహన్ రావు మహిళ భర్తకు ఈ విషయాన్ని తెలియజేశాడు.. దీంతో భర్త ఆ మహిళను అడగడంతో వారిద్దరి మధ్య గొడవ పెరిగింది. దీంతో ఈ గొడవకు కారణమైన రామ్మోహన్ రావును అంతమొందించాలని ఉద్దేశంతో మహిళ ప్రియుడు సాహిర్ రామవరం ప్రాంతానికి చెందిన తన స్నేహితుడు వంశీతో కలిసి పథకం ప్రకారం గణేష్ టెంపుల్ ప్రాంతంలో నివాసముంటున్న రామ్మోహన్రావు ఇంటికి వచ్చి అతని భార్య ముందే బయటకు లాక్కు వచ్చి వెంట తెచ్చుకున్న రాడ్డుతో తలపై దారుణంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం ఎవరికీ తెలియకుండా ఇద్దరు కలిసి అక్కడి నుంచి పారిపోయారు. కేసును సీరియస్ గా తీసుకున్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ త్వరితగతిన కేసును పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చినట్లుగా డిఎస్పి తెలిపారు. ఈ నేపథ్యంలోనే నాలుగు బృందాలుగా విడిపోయిన సిఐలు పలు కోణాల్లో విచారించి బుధవారం మధ్యాహ్నం నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లుగా తెలిపారు. హత్య చేసిన నిందితులపై సదరు మహిళపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. వారిపై రౌడీషీట్లను సైతం తెరుస్తున్నట్లుగా తెలిపారు. కేసును త్వరితగతిన చేదించేందుకు కృషిచేసిన వన్టౌన్ సిఐ కరుణాకర్ టూ టౌన్ సిఐ ప్రతాప్ 3 టౌన్ సిఐ శివప్రసాద్ మరియు చుంచుపల్లి సీఐ రాయల వెంకటేశ్వర్లును అభినందించారు. యువత గంజాయి మత్తులకు అక్రమ సంబంధాలకు మద్యపానానికి అలవాటు పడి జీవితాలను పాడుచేసుకోవద్దని ఈ సందర్భంగా కోరారు.

Related posts

వ్యాసరచనలో ఉత్తమ బహుమతులు అందుకున్న విద్యార్దినీలు విద్యార్థులు

పేకాట స్థావరంగా మారిన జిల్లా కార్యాలయం

ముఖ్యమంత్రి ఎదురుగా నిరసన తెలిపేందుకు ధైర్యం ఉండాలి.సాహసోపేత పోరాటంపై అభినందనల హర్షం

Leave a Comment