హైదరాబాద్‌లో సెలూన్ యజమాని దారుణ హత్య కలకలం రేపింది. నగరంలోని కూకట్‌పల్లి ప్రాంతంలో సెలూన్ నిర్వహిస్తున్న వ్యక్తి (42)ని ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి చంపేసినట్టుగా పోలీసులు తెలిపారు. మృతుడు అశోక్‌గా గుర్తించారు. కూకట్‌పల్లిలో సెలూన్ నిర్వహిస్తున్నాడు అశోక్. అయితే, గతంలో అశోక్ సెలూన్‌లో పనిచేసి మానేసిన పంకజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశోక్ షాపుకు వచ్చే కస్టమర్లను పంకజ్‌తన సొంత సెలూన్‌కి మళ్లించుకున్నాడనే ఆరోపణతో అశోక్ అతనిని పనిలోంచి తొలగించాడని తెలిసింది. నాలుగు నెలల క్రితమే పంకజ్‌ని ఉద్యోగంలోకి తీసుకున్నాడని తెలిసింది.
ఇదిలా ఉండగానే. ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత సెలూన్ షట్టర్ మూసివేసిన అశోక్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని భార్య, కొడుకు సెలూన్‌కు వచ్చి చూశారు.. అక్కడ అశోక్ రక్తపు మడుగులో పడి ఉండటం చూసి భయపడిపోయామంటూ అశోక్ భార్య నీరజా కంప్లైట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. దుండగుడు అశోక్‌ను పలుమార్లు కత్తితో పొడిచి షాపులోని సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు కూకట్‌పల్లి పోలీసులు తెలిపారు.

