U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

అబ్రహం భార్య ఆదిమూలపు శైలజ హఠాన్మరణం.

అబ్రహం భార్య ఆదిమూలపు శైలజ హఠాన్మరణం.భార్య మరణం అబ్రహం గారికి తీరని లోటు..పరామర్శించిన కొత్తగూడెం ఎమ్మెల్యే అభ్యర్థి ఇమంది ఉదయ్ కుమార్.ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.రోటరీ గవర్నర్ జె.అబ్రహం సతీమణి.ఆదిమూలపు శైలజ (59 సం..లు)సోమవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురై గుండెపోటుతో ఆకస్మిక మరణం పాలయ్యారు.అందరితో చలాకీగా ఉండే అబ్రహం భార్య మరణంతో తీవ్ర వేదనకు గురయ్యారు. రేపు ఉదయం 6 గంటల వరకు కొత్తగూడెంలోని విద్యానగర్లో ఉన్న అబ్రహం స్వగృహం నందు వారి సతీమణి పార్థివ దేహం మిత్రుల సందర్శనార్థం ఉంచబడుననీ కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆరు గంటల తర్వాత వారి స్వగృహము ఒంగోలు జిల్లా మార్కాపురం బయలుదేరి వెళ్తారని తెలియజేశారు. అక్కడే అంత్యక్రియలు నిర్వహించబడునని కావున కొత్తగూడెం పరిసర ప్రాంత అబ్రహం మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలియజేయడమైనదని అన్నారు. పరామర్శించిన వారిలో ఉదయ్ కుమార్ వెంట సీమకుర్తి రామకృష్ణ గణేష్ రేవంత్ చిన్న తదితరులు పాల్గొన్నారు

Related posts

రానున్న గ్రామీణ ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపు

జర్నలిస్టుల సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలి..ఐజేయు భద్రాద్రి జిల్లా తీర్మానం.

పాల్వంచ ఆర్టీఏ చెక్‌పోస్టుపై ఏసీబీ దాడులు..!

Leave a Comment