లక్ష్మిదేవి పల్లి మండలంలో రామ సహాయం రఘురాం రెడ్డి విస్తృత పర్యటన
లక్ష్మిదేవి పల్లి , జులై 01 ( ఉదయం న్యూస్ )
గ్రామీణ ఎన్నికల్లో నిలబడే అభ్యర్థుల ఎంపికలు స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు , నాయకులు బాధ్యత వహించాలని ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాం రెడ్డి అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మిదేవి పల్లి మండలంలో విస్తృత పర్యటనలో భాగంగా ఉమ్మడి చాతకొండ గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రానున్న గ్రామీణ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక బాధ్యత స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలదే అన్నారు. రానున్న ఎన్నికలకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాలన్నారు. గ్రామీణ ఎన్నికల్లో గెలుపే ద్యేయంగా ప్రతి ఒక్కరు పని చేయాలని కోరారు. ఈ సందర్భంగా స్థానిక సమస్యలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో సాటివారిగూడెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ పునేం సంధ్య , చాతకొండ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ బాధవత్ అనూష , మాజీ వార్డు మేంబర్ రావు ప్రమీల , ఉమ్మడి చాతకొండ కాంగ్రెస్ నాయకులు కొంపెళ్లి వీరన్న , దయ్యాల సమ్మయ్య , వజ్జ చంద్రశేఖర్ , బోయినపల్లి రాము , ఉబ్బని రాజు , రావు కిరణ్ , చింత రమేష్ తదితరులు పాల్గొన్నారు.

