U9udayam.com | Telugu Local News App Latest News
తెలంగాణ

జడ్పీ చైర్మన్ ను అభినందించిన నయీమ్ ఖురేషి

జడ్పీ చైర్మన్ ను అభినందించిన నయీమ్ ఖురేషి.
ఉదయం / భద్రాద్రి కొత్తగూడెం.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్గా నియమింపబడ్డ కంచర్ల చంద్రశేఖరరావును టిపిసిసి మైనారిటీ వైస్ చైర్మన్ నయీమ్ ఖురేషి అభినందించారు. మంగళవారం నాడు కొత్తగూడెం మహేశ్వరి థియేటర్ కార్యాలయంలో జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావును పూల బొకేలు శాలువాలతో సన్మానించారు అనంతరం చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలోని పలు సమస్యలపై చర్చించారు. జిల్లాలోని పంచాయతీ పరిధిలో మండలాలకు సంబంధించిన సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుంటానని పార్టీలకు అతీతంగా జడ్పీలో సేవలు అందిస్తానని ఆయన అన్నారు. నయీమ్ ఖురేషితోపాటు భద్రాద్రి జిల్లా మైనారిటీ నాయకులు తాజుద్దీన్, హుస్సేన్, రెడ్డి, జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ భూమైనా… నడిరోడ్డైనా డోంట్ కేర్..

సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల సమస్యల పరిష్కారానికై ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలి

యస్.సి.వర్గీకరణపై అనుకూల ప్రకటన,బి.సి.కులగనణపై కీలక ప్రకటన చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి పాలాభిషేకం

Leave a Comment