ఉదయం /భద్రాద్రి కొత్తగూడెం.
జామాయిల్ కర్ర లోడుతో వెళ్తున్న లారీ వల్ల ప్రజలకు తృటిలో పెను ప్రమాదం తప్పింది.
వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్ ఎదురుగా ఇతర ప్రాంతం నుంచి కొత్తగూడెం మీదుగా భద్రాచలం వెళ్తున్న జామాయిల్ కర్రలోడు లారీ కమాన్ పట్టి విరిగి అమాంతం ఒక పక్కకు ఒరిగింది. లారీ భారీ స్పీడ్ తో ఉంటే గనక పక్కనే ప్రయాణిస్తున్న ప్రయాణికులపై లేదా పాదచారులపై వాహనం పూర్తిగా పడిపోయి ఉండేది. దీంతో ప్రమాదం జరిగేది. అదృష్టవశాత్తు కర్రలోడుతో ఉన్న లారీ ఒక పక్కకు ఒరిగి ఆగిపోయింది. 2023 సంవత్సరాంతంలో ఇదే విధంగా అండర్ బ్రిడ్జిలో ఎన్టీఆర్ విగ్రహం ఎదురుగా పాల్వంచ నుంచి విజయవాడ వెళుతున్న బూడిద ట్యాంకర్ లారీ ఒక్కసారిగా టూ వీలర్ పై పడి ఇద్దరు చనిపోయిన సంఘటనను ఈ ఘటన గుర్తుచేసింది. గణేష్ టెంపుల్ ప్రాంతంలో చపాతీల వ్యాపారం నిర్వహించే ఇద్దరిపై భారీ యాష్ ట్యాంకర్ పడి వారు నుజ్జు నుజ్జైన సంగతి అందరికీ తెలిసిందే. ఏది ఏమైనా సింగరేణి వచ్చిన టైంలో గనుక ఈ లారీ వచ్చి ఉంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉండేవి.. రైల్వే స్టేషన్ ఎదురు మరియు అండర్ బ్రిడ్జి బస్టాండ్ ప్రాంతాలలో మూలమలుపులలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. ప్రయాణికులకు గాని వాహనదారులకు గాని పాదచారులకు గాని ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చుంచుపల్లి సీఐ వెంకటేశ్వరరావు త్రీ టౌన్ ఎస్ఐ ఇతర పోలీసులు ముందు జాగ్రత్తగా వెంటనే లారీకి ఇరుపక్కల బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ను మళ్ళించారు.
previous post
next post

