U9udayam.com | Telugu Local News App Latest News
ఉద్యోగాలుక్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణరాజకీయం

కార్మికులకు బోనస్ను వెంటనే చెల్లించాలి..


ఉదయం/ భద్రాద్రి కొత్తగూడెం.

వికేసిఎం కోల్ మైన్ లొ మట్టి వెలికి తీసే పనులను నిర్వహిస్తున్న సోదా కంపెనీ యందు పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు రావలసిన 20% బోనస్ను చెల్లించాలని చట్టబద్ధ హక్కులు సౌకర్యాలు అమలు చేయాలని కార్మికులపై వేధింపులు మానుకోవాలని తదితర డిమాండ్లతో మంగళవారం రెండవ షిఫ్ట్ నుండి సింగరేణి కాంటాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికుల నిరసన దీక్ష ప్రారంభమై రెండోరోజు కొనసాగుతుంది ఈ సందర్భంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఏఐటీయు సీ కాంట్రాక్ట్ విభాగo కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి జి వీరస్వామి ఐఎన్టీయూసీ కాంట్రాక్టు విభాగం రాష్ట్ర నాయకులు జెట్టి మోహన్ ఐఎఫ్టియు కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి ఎన్ సంజీవ్ సిఐటియు నాయకులు నాగయ్య బి ఎం ఎస్ నాయకులు రఘు టీబీజీకేస్ నాయకులు హైమద్ డిడబ్ల్యూఎస్ నాయకులు బాచి హెచ్ఎంఎస్ నాయకులు జలీల్ టి టి ఎన్ టియు సి నాయకులు కోటి సికేహెచ్ పిఎస్ నాయకులు తోకల రామచందర్ తదితరులు ప్రసంగిస్తూ గత రెండు నెలలుగా బోనస్ చెల్లించాలని సోదా యాజమాన్యంతొ వికేసిఎంలో పనిచేస్తున్న ఓబి కాంట్రాక్ట్ కార్మికులు రెండు నెలలుగా శోదయాజమాన్యాన్ని కోరుతున్నప్పటికీ సోదా యాజమాన్యం చర్చల పేరుతోటి కాలయాపన చేస్తూ కార్మికులకు రావలసినటువంటి బోనస్ను ఇవ్వకుండా జాప్యం చేస్తూ కార్మికులకు ఎటువంటి సమాచారం లేకుండా నిన్న అతి తక్కువ బోనస్ను కార్మికుల యొక్క ఎకౌంట్లో వేసినందుకు నిరసనగా నిన్నటి మధ్యాహ్నం నుండి వీకే సీఎం కోల్ మైన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా తమ నిరసనను వ్యక్తం చేశారు ఆ నిరసన కార్యక్రమం ఈరోజు కూడా పూర్తిగా కొనసాగింది ఈ నిరసన కార్యక్రమం కొనసాగడానికి కార్మికుల యొక్క తీవ్ర నిరసన ఎదుర్కోవడానికి పూర్తి బాధ్యత శోద యాజమాన్యం దేనని కార్మికులకు రావలసినటువంటి బోనస్ను ఇవ్వకుండా అతి తక్కువ బోనస్ ఇవ్వడం వల్ల కార్మికులు తమ ఆగ్రాహన్ని వ్యక్తం చేస్తూ నిరసన కార్యక్రమంలోకి దిగడం జరిగిందని పూర్తిస్థాయి బోనసు ఇచ్చేవరకు కూడా కార్మికులు ఎవరు నిరసనను విరమించే పరిస్థితి లేనందున అటు సింగరేణి యాజమాన్యం ఇటు కాంటాక్ట్ కార్మిక సంఘాలు శోదా యాజమాన్యం చర్యల వల్ల ఇబ్బందులు పడుతున్నందున తక్షణమే సింగరేణి యాజమాన్యం స్పందించి కార్మికులకు రావలసినటువంటి పూర్తిస్థాయి బోనసును ఇప్పించి ఈ యొక్క నిరసన కార్యక్రమం ముగించే విధంగా కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు లేనిచో కార్మికుల యొక్క నిరసన తీవ్ర రూపం దాల్చి అది నిరవధిక ఆందోళన కార్యక్రమాలకు పూను కొనుoదని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు సోద యాజమాన్యాన్ని హెచ్చరించారు తక్షణమే సోదా యాజమాన్యం కార్మిక సంఘాల సింగరేణి యాజమాన్య ఉన్నత అధికారుల విజ్ఞప్తిని ఆలోచించి కార్మికులకు రావలసిన పూర్తిస్థాయి బోనస్ను ఇవ్వాలని జేఏసీ నాయకులు కోరారు
ఈ యొక్క కార్యక్రమంలో మార్షల్ శ్రీను సతీష్ జి వెంకన్న ఎస్ అశోక్ ప్రమోద్ శివ పాషా బాజీ కోటి నవీన్ శ్రీను కోటేశ్వరరావు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

భద్రాద్రి కి గర్వ కారణంకలెక్టర్ జితేష్ వి.పాటిల్.

వాహనదారుల ప్రాణాలతో చెలగాటం

కిన్నెరసాని నీటి పథకం.. లీకేజీలే అధికం..

Leave a Comment