U9udayam.com | Telugu Local News App Latest News
క్రైమ్ వార్తలుజాతీయ వార్తలుతెలంగాణరాజకీయం

భద్రాచలం పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు IPS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఎస్పీ కార్యాలయం

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ భద్రాచలం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను, రికార్డులను, సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

పోలీస్ స్టేషన్‌కు వివిధ సమస్యలతో వచ్చే బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ, వారి సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. స్టేషన్ పరిధిలో నమోదైన కేసుల వివరాలను అడిగి తెలుసుకొని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నాణ్యమైన దర్యాప్తుతో కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని స్పష్టం చేశారు.

పోలీస్ స్టేషన్‌లో వివిధ విభాగాల వారీగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది పనితీరును సమీక్షించి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పోలీసింగ్ వెబ్ అప్లికేషన్ల వినియోగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై నిరంతరం నిఘా ఉంచుతూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు గ్రామాలు, పట్టణాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, డయల్ 112 ద్వారా అత్యవసర సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు తక్షణ సహాయం అందించాలని సూచించారు.

అనంతరం పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకొని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని జిల్లా ఎస్పీ తెలిపారు.

Related posts

ప్రజాక్షేత్రంలోకి “నేనొస్తున్న”

అల్ జమాత్ ముస్లింల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కూనంనేని కి ఘన సన్మానం..

క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే తెల్లం…!!

Leave a Comment